AP: ఆస్ట్రేలియాతో జరుగుతున్న 4వ టెస్టులో సెంచరీ చేసిన నితీశ్ కుమార్ రెడ్డిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా నితీశ్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ‘భారత్‌లో ఏ భాగం నుంచి వచ్చారనేది ముఖ్యం కాదు. దేశం కోసం మీరు ఏం చేశారనేది ముఖ్యం. నితీశ్.. భారత్ గర్వించేలా చేశారు. మీరు మరిన్ని ప్రపంచస్థాయి రికార్డులను సాధించాలి’ అని పేర్కొన్నారు.