మీడియా ప్రతినిధులపై సినీనటుడు మోహన్ బాబు దాడి చేయటాన్ని పలువురు రాజకీయ ప్రముఖులు ఖండిస్తున్నారు. వెంటనే మోహన్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకోవాలని బీజేపీ ఎంపీ రఘునందన్ డిమాండ్ చేశారు. దాడి విషయంలో చట్టం తన పని తానూ చేసుకుంటూ పోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా దాడికి గురైన జర్నలిస్టు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అతనికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.