కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. మద్దూరులో మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల సందర్శనార్థం అనుమతించనున్నారు. సాయంత్రం 4 గంటలకు అక్కడే ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. కర్ణాటక ప్రభుత్వం లాంఛనాలతో ఎస్ఎం కృష్ణ అంత్యక్రియలు జరిపించనుంది. కాగా.. ఆయన మృతి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం బుధవారం సెలవు ప్రకటించడంతో పాటు మూడు రోజులు సంతాప దినాలు పాటించాలని ఆదేశించింది.