AP: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. పవన్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా రేపు 111 మంది జనసేన నేతలు దీక్ష చేపట్టనున్నారు. లడ్డూ కల్తీపై జగన్ ముఠా సమాధానం చెప్పడం లేదని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సమాధానం చెప్పలేక బెంగళూరు పారిపోయారని.. ధైర్యం ఉంటే తాడేపల్లి ప్యాలెస్‌లోనే ఉండాలంటూ ఎద్దేవా చేశారు.