బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘రెండున్నర రోజుల ఆటను కోల్పోయిన తర్వాత నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. బంగ్లాను తక్కువ పరుగులకు కట్టడి చేసి వీలైనంత ఎక్కువ రన్ రేట్ ఉండేలా బ్యాటింగ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. అలా తాము 100 పరుగులకు ఆలౌటైన ఫర్వాలేదనే మైండ్ సెట్‌తో ఆడాం. చివరకి మ్యాచులో విజయం సాధించాం’ అని పేర్కొన్నారు.