AP: జగన్ ప్రభుత్వం మోసం చేసి గ్రామ వాలంటీర్లను పెట్టుకుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా గ్రామ వాలంటీర్ల అంశమే లేదని చెప్పారు. అసలు ఉద్యోగాల్లోనే లేరంటే.. రద్దు అంశం ఎక్కడుందని అన్నారు. జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తామని, చెరువుల్లో పూడికలు తీసి.. నీరు కలుషితం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.