తాను వ్యాపార వ్యతిరేకి కాదని, కేవలం గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకిస్తానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ‘ఓ విషయంపై స్పష్టతనివ్వాలని అనుకుంటున్నా. బీజేపీలోని కొందరు వ్యక్తులు నన్ను వ్యాపార వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారు. ఉద్యోగ కల్పన, వ్యాపారానికి, ఆవిష్కరణలకు, పోటీతత్వానికి మద్దతు ఇస్తా. వ్యాపార విజయానికి అవసరమైన అంశాలను అర్థం చేసుకోగలను’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.