NLR: కోట లోని శ్యామసుందరపురం రేషన్ దుకాణంలో సుమారు 3500 కిలోల బియ్యం మాయం అవ్వడంతో రెవిన్యూ అధికారులు స్పందించారు. గురువారం కోట తహసీల్దార్ జయజయరావు, సీఎస్ఓటీ మల్లికార్జున్, ఆర్ఎ మధులత గ్రామంలో సమగ్ర విచారణ జరిపారు. 3,300 కేజీల రేషన్ బియ్యం, 252 ప్యాకెట్ల చక్కెర, ఎండీఎం బియ్యం 1,560 కేజీలకు లెక్కల్లో తేడా ఉన్నట్లు గుర్తించారు.