TG: అభివృద్ధి, సంక్షేమాలను రెండు కళ్లలా భావిస్తూ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. రూ.7 లక్షల కోట్లకుపైగా అప్పులున్నా.. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యానికి 11 నెలలు గడిచాయని గుర్తుచేశారు.