బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నట్లు గుర్తించామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(MEA) వెల్లడించింది. అక్కడి హిందువుల ఆస్తులను, వ్యాపార సంస్థలను దోచుకున్నారన్నారు. వీటి వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు అర్థమవుతోందని తేల్చి చెప్పింది. కాగా, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని తాము బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నామని MEA అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.