GNTR: కర్లపాలెం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్‌పై విజయం స్క్రీనింగ్ తోనే సాధ్యమన్నారు. ముందస్తు పరీక్ష-క్యాన్సర్ నుంచి రక్ష అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ డాక్టర్లు గోపీనాథ్, సుహానా బేగం, సీహెచ్‌వో మేరమ్మ, హెల్త్ సూపర్వైజర్ ప్రభావతి, ఇస్సాకు తదితరులు పాల్గొన్నారు.