AP: అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా మీడియా ముందే ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు. అసెంబ్లీకి వెళ్లినా లాభం ఉండదని.. తమకు మైక్ ఇవ్వరని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు ఎంత సేపు జరిగితే అంతసేపు తమ పార్టీ ప్రెస్మీట్ పెడుతుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ఛానళ్ల ద్వారా తాము ప్రతిపక్ష బాధ్యత నిర్వహిస్తామని తెలిపారు.