AP: సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై జగన్ స్పందించారు. తమ వాళ్లే కాదని.. టీడీపీ సోషల్ మీడియాలో కూడా ఫేక్ పోస్టులు వస్తున్నాయని తెలిపారు. విజయమ్మ లెటర్‌ను కూడా ఫేక్ అని ఫేక్ ప్రచారం చేశారన్నారు. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదన్న సంగతి పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు. రెడ్ బుక్ టీడీపీ వాళ్లే కాదని.. ఇవాళ నష్టపోయిన ప్రతి కుటుంబం పెట్టుకుంటుందని పేర్కొన్నారు.