AP: విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందకు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విశాఖ శారదా పీఠానికి కేటాయించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. గత ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాలను రెవెన్యూ శాఖ స్వాధీనం చేసుకుంది. ఆ భూముల విలువ బహిరంగ మార్కెట్లో 225 కోట్లపైమాటేనని తెలుస్తుంది. అయితే అప్పటి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా 15 లక్షల రూపాయలకే శారదా పీఠానికి ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి.