ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువైపోయాయి. తాజాగా తమిళనాడులో ఈరోడ్ జిల్లా సుందాపుర్లో ఓ ఉపాధ్యాయుడు(49) తరగతి గదిలో పాఠాలు బోధిస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆ ఉపాధ్యాయుడు అక్కడికక్కడే కుప్పకూలాడు. అప్రమత్తమైన తోటి ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించగా.. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.