జార్ఖండ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే గర్వాలో జరిగిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. బీజేపీ అధికారంలోకి వస్తే 3 లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. జార్ఖండ్ యువతలో ప్రతిభకు కొదవ లేదన్నారు. జార్ఖండ్‌కు చెందిన కుమారులు, కుమార్తెలు క్రీడారంగంలోస్ఫూర్తిని చాటుతున్నారని కొనియాడారు. కాగా జేఎమ్ఎమ్, కాంగ్రెస్, ఆర్జేడీలు యువతకు ద్రోహం చేశాయని ఆరోపించారు.