AP: మచిలీపట్నంలోని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని నివాసం వద్ద జనసేన నేతలు ఆందోళన చేపట్టారు. పవన్ కళ్యాణ్‌పై పేర్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన కార్యకర్తలు నిరసన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో YCP కార్యకర్తలు పేర్ని ఇంటికి చేరుకున్నారు. ఇరువర్గాల ఆందోళనతో భారీగా పోలీసులు మోహరించారు. జనసేన, వైసీపీ కార్యకర్తల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.