TG: ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు ఇబ్బందులు లేకుండా కొనుగోల్లు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ‘కొనుగోళ్ల ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.