దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగింది. బాణసంచాపై నిషేధం ఉన్నప్పటికీ దీపావళి రోజు టపాసులు కాల్చారు. దీంతో నగరంలో తీవ్రమైన శబ్దకాలుష్యంతో పాటు గాలి నాణ్యత విపరీతంగా పడిపోయింది. ఇవాళ ఉదయం దట్టమైన పొగ అలుముకుంది. ఎదురుగా ఉన్న వాహనాలు కన్పించలేనంత పరిస్థితి నెలకొంది. నగరంలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ 350కి పైగా పాయింట్లకు చేరుకుందని అధికారులు వెల్లడించారు.