దీపావళి పండుగ రోజు ఓ ఇంట్లో విషాదం నెలకొంది. ఓ కుటుంబంపై దుండగులు కాల్పులు జరపగా.. ఇద్దరు చనిపోయారు. ఆకాష్ వర్మ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా.. బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వారిపై కాల్పులు జరిపారు. ఆ సమయంలో నిందితుల్లో ఒక్కరు ఆకాష్ వర్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ ఘటనలో ఆకాష్ వర్మ, తన మేనల్లుడు చనిపోయారు. ఆయన కుమారుడికి గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.