NRML: కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ బానావత్ గోవింద్ నాయక్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీల మేరకు సీఎం రేవంత్ రెడ్డి అక్టోబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా సర్వే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.