దేశవ్యాప్తంగా సంతోషంగా జరుపుకునే దీపావళి పండుగకు ఓ గ్రామం 70ఏళ్లుగా దూరంగా ఉంటుంది. ఓ మహిళ శాపం వల్ల హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్పుర్ జిల్లా సమ్మూర్ గ్రామం దీపావళి జరుపుకోవడం లేదు. దీపావళి పండుగ రోజు గ్రామానికి చెందిన ఓ గర్భిణి సతీసహగమనం అయ్యింది. ఆమె చనిపోతూ గ్రామంలో ఇక నుంచి దీపావళి జరుపుకోవద్దని శాపం పెట్టిందని ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్నారట.