NLG: నకిరేకల్ మండలం మోడినిగూడెం గ్రామంలో విద్యుత్ అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పంటపొలాల్లో విద్యుత్ తీగలు కిందికి వేలాడుతూ మృతుపాశాలుగా మారాయని రైతులు ఆరోపించారు. తీగలు కిందకు వేలాడుతు ఉన్నాయని రెండేళ్ల నుంచి మొర పెట్టకున్న పట్టించుకున్న నాధుడే లేడని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ లైన్లను సరిచేయాలని రైతులు కోరారు.