ప్రకాశం: టంగుటూరు మండలం కారుమంచి గ్రామంలో మంత్రి స్వామి పింఛన్లు పంపిణీ చేశారు. శుక్రవారం ఉదయాన్నే గ్రామానికి వెళ్లిన ఆయన వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేసి మాట్లాడారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మంచంలో కదల లేకుండా ఉన్న వారికి నెలకు పదివేల రూపాయలు చొప్పున పింఛన్ చేస్తున్నట్లు చెప్పారు. జగన్ హయాంలో పింఛన్లు ఏటా 250 మాత్రమే పెంచారని గుర్తు చేశారు.