ఎన్ని ఇబ్బందులున్నా ఒకటో తారీఖునే పింఛన్లు ఇస్తున్నామని మంత్రి DBV స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా కారుమంచిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామన్నారు. పింఛన్ల పెంపుపై మాట తప్పి వృద్ధులను జగన్ మోసం చేశారని విమర్శించారు. తల్లి, చెల్లిని మోసం చేసిన జగన్కు ప్రజలను మోసం చేయడం ఓ లెక్కా? అని మండిపడ్డారు. తమది మంచి ప్రభుత్వమని అన్నారు.