చెట్లు కొట్టడానికి అనుమతి అవసరమని తనకు తెలియదని ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ప్రాంతంలో చెట్లు కొట్టడానికి న్యాయస్థానం అనుమతి ఉండాలనే విషయంపై తనకు సరైన అవగాహన లేదని సుప్రీంకోర్టుకు ఆయన తెలిపారు. అక్రమంగా 6 వేల చెట్లను నేల కూల్చడంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అఫిడవిట్ ద్వారా తెలియజేయాలని సక్సేనాను సుప్రీంకోర్టు ఆదేశించింది.