AP: కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కాంట్రాక్టు లెక్చరర్ల JAC డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు తమను ఆదుకుంటామని మాట ఇచ్చారని పేర్కొంది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న వేలాదిమంది ఉద్యోగులు ఇందుకు అర్హులని, ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రభుత్వం వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని తెలిపింది.