ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరా ఆపేయాలని పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ తెలిపారు. వెస్ట్‌బ్యాంక్, గాజాలో రక్తపాతం ఆపేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో అమెరికా గురించి అబ్బాస్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 15 వేల మంది చిన్నారుల మృతికి కారణం ఎవరని ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఆయన ప్రశ్నించారు.