గాజాలో మానవతా సాయం అందించే విషయంలో ఇజ్రాయెల్‌కు అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఏడాదిగా కొనసాగుతున్న ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం కారణంగా గాజాలో పరిస్థితులు తీవ్రస్థాయిలో దిగజారుతున్నాయి. అలాగే అక్కడ మానవతా సాయం అందించడం కూడా తగ్గిపోయింది. దీంతో 30 రోజుల్లోగా గాజాలోకి వెళ్లే మానవతా సాయాన్ని పెంచాలని అమెరికా ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. లేదంటే సైనిక సాయాన్ని ఆపేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.