AP: ఏలూరు కాల్ మనీ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. కిస్తీలకు ముందే వడ్డీకోత, సమయం దాటితే డబుల్ కిస్తీలు వసూలు చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక వడ్డీలు, అక్రమ వసూళ్లతో వేధింపులకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటివి జరగకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. వడ్డీల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని స్పష్టం చేశారు.