TG: పచ్చదనం కోసం గత ప్రభుత్వ హయాంలో పిచ్చిమొక్కలు నాటారని మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటి వల్ల శ్వాసకోశ ఇబ్బందులు వస్తున్నాయని మళ్లీ ఇప్పుడు నరికేస్తున్నారని మండిపడ్డారు. కబ్జాలు, అక్రమణలు, బెదిరింపులతో ఖమ్మంను అతలాకుతలం చేశారన్నారు. రోడ్లు ఆక్రమించి షెడ్లు, ఇళ్లు, కిరాణాలు నిర్మించుకుంటే అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేయకుండా ఏం చేశారని ప్రశ్నించారు. కబ్జాలు, ఆక్రమణలు చేసిన ఏ ఒక్కరినీ వదలనని హెచ్చరించారు.