»The Bull Climbed On The Roof Of The Police Post In Rae Bareli Created Panic Among The Policemen
Uttarpradesh : స్టేషన్ మీదకు ఎక్కి పోలీసులను భయపెట్టిన ఆవు
ఉత్తరప్రదేశ్‌లో జంతువులు ముఖ్యంగా ఎద్దులు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయి. లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ, అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఎద్దుల సమస్య చర్చనీయాంశంగా మారింది.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లో జంతువులు ముఖ్యంగా ఎద్దులు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయి. లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ, అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఎద్దుల సమస్య చర్చనీయాంశంగా మారింది. దీని తర్వాత కూడా వాటి వల్ల ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు దొరకడం లేదు. ఈ ఎద్దుల వల్ల రైతులు, సామాన్య ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, పోలీసులు సైతం ఇబ్బంది పడుతున్నారు. రాయ్‌బరేలీలో ఓ ఎద్దు పోలీసు స్టేషన్ పైకి కూడా ఎక్కింది. దీంతో మొత్తం స్టేషన్ లో భయాందోళన నెలకొంది. కింద కూడా జనం గుమిగూడారు. దీన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. ఎలాగోలా ఎద్దును కిందకు దించడంలో పోలీసులు సక్సెస్ అయ్యారు.
ఇక్కడి సలోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లిస్ట్ పోలీస్ పోస్ట్ సమీపంలో ఇంటిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం నిర్మించిన మెట్ల మీదుగా ఎద్దు పోలీసు పోస్టు పైకప్పుపైకి చేరుకుంది. అర్థరాత్రి పోలీస్ పోస్ట్ పైకప్పుపై ఎద్దును చూసిన ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎద్దు పోస్ట్‌పైకి ఎలా చేరిందో ప్రజలకు మొదట అర్థం కాలేదు. అప్పుడు పక్కనే నిర్మాణంలో ఉన్న ఇల్లు, అక్కడ కట్టిన మెట్లు గురించి తెలియగానే విషయం అర్థం అయింది. పోలీస్ పోస్ట్ పైకప్పుపైకి ఎక్కిన తరువాత, ఎద్దు కొంతసేపు నిలబడి, ఆపై హాయిగా పైకప్పుపై కూర్చుంది. పోస్ట్‌పై ఉన్న ఎద్దును చూసి గ్రామస్తులు పెద్ద ఎత్తున గుమిగూడారు. దీంతో పోలీసులు ఎద్దును పైకప్పు నుంచి కిందకు దించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. లాలిస్తూ, అరుస్తూ ఎలాగోలా ఎద్దును కిందకు దించారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.