Supreme Court: స్త్రీ ధనంపై భర్తకు ఏమాత్రం హక్కు ఉండదు

భార్య ధనంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు నిచ్చింది. పెళ్లి సందర్భంగా వధువుకు పుట్టింటి వారు ఇచ్చే స్త్రీధనంపై భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని తెలిపింది.

  • Written By:
  • Updated On - April 26, 2024 / 11:06 AM IST

Supreme Court: భార్య ధనంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు నిచ్చింది. పెళ్లి సందర్భంగా వధువుకు పుట్టింటి వారు ఇచ్చే స్త్రీధనంపై భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని తెలిపింది. ఒకవేళ కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే ఆ సొమ్మను ఉపయోగించుకోవచ్చు. కానీ తర్వాత తిరిగి భార్యకు ఇచ్చేయాలని సుప్రీం చెప్పింది. ఓ మహిళకు పెళ్లి సమయంలో తన పుట్టింటి వాళ్లు భారీగా బంగారు ఆభరణాలు ఇచ్చారని, అలాగే పెళ్లి తర్వాత తన తండ్రి భర్తకు రూ.2 లక్షల చెక్ కూడా ఇచ్చారని తెలిపింది.

ఇది కూడా చూడండి: Fire Accident : పెళ్లి వేడుకలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి మృతి

మొదటిరాత్రి రోజే ఆ ఆభరణాలన్ని తన భర్త తీసుకుని.. భద్రపరుస్తానంటూ తన తల్లికి అప్పగించాడు. అంతకు ముందు వాళ్లకు ఉన్న అప్పులు తీర్చడానికి వినియోగించారని ఆ మహిళ ఆరోపించింది. దీనిని కేరళ హైకోర్టు కొట్టేయడంతో బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో కేసును విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం స్త్రీ ధనం భార్యభర్తల ఉమ్మడి ఆస్తి కాదని తెలిపింది. ఆ ఆస్తిపై భర్తకు ఎలాంటి హక్కు ఉండదని తెలిపింది. ఆమె ఆభరణాలు దుర్వినియోగం చేసినందుకు ఆమెకు రూ.25 లక్షలు చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.

ఇది కూడా చూడండి: Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 April 26th)..పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది

Related News