ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ధామ్‌లోని అలకనంద నీటిమట్టం నిరంతరం పెరుగుతోంది. నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. ప్రయాణికులు, స్థానిక ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రజలు నది ఒడ్డుకు వెళ్లవద్దని పరిపాలన విజ్ఞప్తి చేసింది.
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో సైనికులు, నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. నారాయణపూర్ అడవుల్లో భారీ కాల్పులు కొనసాగుతున్నాయి.
యూపీలోని హత్రాస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సికంద్రారావులోని ఫుల్రాయ్ గ్రామంలో సెయింట్ భోలే బాబా ప్రసంగం జరుగుతోంది. పెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు.
లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో విపక్షాలు రచ్చ సృష్టించాయి. ప్రధాని ప్రసంగం ప్రారంభం కాగానే పలువురు విపక్ష ఎంపీలు తమ సీట్లపై లేచి నిలబడి నినాదాలు చేయడం ప్రారంభించారు.
కాలేజీ ఆవరణంలో విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషనల్ సొసైటీ ఇటీవల నిషేధించింది. తాజాగా టీషర్ట్‌లు, జీన్స్‌పైన కూడా నిషేధం విధించింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై కోర్టు సీబీఐని వివరణ కోరింది.
నీట్ యూజీ పరీక్ష ఫలితాలు జూన్ 4న వెలువడ్డాయి. అప్పటి నుంచి ఈ విషయంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షల్లో రిగ్గింగ్ జరిగిందని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు.
మోడీ సర్కార్ సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ నినాదంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగంపై ఒవైసీ మాట్లాడుతూ..
పై హెడ్డింగు చూసి నమ్మడం లేదా కానీ ఇది నిజం. ఫతేపూర్‌లోని సౌరా గ్రామానికి చెందిన 24 ఏళ్ల వికాస్ దూబేను పాములు నిరంతరం వెంబడిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రతిపక్ష నేత హోదాలో ఉండి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సభలో అవమానకరంగా ఉన్నాయని మోదీ అన్నారు. ఆయనలా ఎవరూ ప్రవర్తించవద్దని.. ఎన్డీయే ఎంపీలు పార్లమెంటరీ విధానాలను పాటించాలని సూచించారు.
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నిన్న లోక్‌సభలో చేసిన ప్రసంగం తీవ్ర దుమారం రేపింది. ప్రతిపక్ష హోదాలో మాట్లాడిన అతను కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీతో పాటు హోం మంత్రి అమిత్‌షా కూడా రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ మధ్య కాలంలో ముంబయిలోని సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు విస్తుపోయే వివరాలు తెలిశాయి. సల్మాన్ ఖాన్‌ని హత్య చేసేందుకు పక్కాగా కుట్ర పన్నిన వైనం తెలిసింది.
అనంత్ అంబానీ వివాహానాకి ముందు సోమవారం ఓ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన ఓ అరుదైన వాచ్‌ని ధరించారు. ఇప్పుడు ఆ వాచ్ సంగతులు అందరికీ ఆసక్తిగా మారాయి. అవేంటంటే?
1 జూలై 2018న ఢిల్లీలోని బురారీలో జరిగిన సామూహిక ఆత్మహత్య ఉదంతం గుర్తుండే ఉంటుంది. ఆరేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు.
గుజరాత్‌లో మద్యం అమ్మకాలపై నిషేధం ఉంది. అయితే పోలీసులే ఈ నిషేధాన్ని చట్టవిరుద్ధంగా ఉపయోగించుకుని మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు.