»Nipah Virus In Bats Of 9 States Shocking Things In Research
Nipah Virus: 9 రాష్ట్రాల గబ్బిలాలలో నిపా వైరస్..పరిశోధనల్లో షాకింగ్ విషయాలు
నిపా వైరస్‌పై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ నిపుణులు తమ పరిశోధనలలో షాకింగ్ విషయాలను కనుగొన్నారు. నిపా వైరస్ రావడానికి గల కారణాలను వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా వైద్య నిపుణులు నిపా వైరస్(Nipah Virus)పై పరిశోధనలు చేస్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ICMR) ఈ వైరస్‌పై సర్వే చేపట్టింది. ఇప్పటి వరకూ తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ పరిశోధన సాగింది. ఆ పరిశోధనల నివేదికలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. శాస్త్రవేత్తలు (Scientists) నిపా వైరస్ వ్యాప్తికి గల ఆధారాలను కనిపెట్టారు. పరిశోధనలు చేసిన తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని గబ్బిలాలలో నిపా వైరస్ వ్యాప్తి చెందే ఆధారాలను వారు నివేదిక విడుదల చేశారు.
తెలంగాణ. గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, చండీగఢ్లల్లో కొన్ని ప్రత్యేక పరీక్షలు చేశారు. ఇప్పటి వరకూ 14 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు సర్వేను పూర్తి చేశారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, పాండిచ్చేరి వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిపా వైరస్ (Nipah Virus) యాంటీబాడీలు గబ్బిలాలలో కనిపించినట్లు శాస్త్రవేత్త డాక్టర్ ప్రజ్ఞా యాదవ్ (Pragna Yadav) వెల్లడించారు.
నిపా వైరస్(Nipah Virus)ను గుర్తించిన ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు(Scientists) ప్రత్యేక చొరవతో ఈ పరిశోధనలను పూర్తి చేశారు. ఈ నిపా వైరస్ మానవులలో ప్రాణాంతక శ్వాసకోశ, మెదడు ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని ICMR తేల్చి చెప్పింది. 2018-19లో కేరళలో ఈ నిపా వైరస్ వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి మరింత నిఘాను పరిశోధకులు పెంచారు. గతంలో అస్సాంలోని ధుబ్రీ జిల్లాలోని గబ్బిలాలలో నిపా వైరస్ ఉన్నట్లు ICMR-NIV పరిశోధనలో తేలింది. అలాగే వివిధ ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తిని గుర్తించి సర్వేను నిర్వహిస్తున్నారు.