»Mokshagundam Visvesvaraya 162nd Jayanti National Engineers Day 2023
National Engineers Day 2023: విశ్వేశ్వరయ్య జయంతి..హ్యాప్పీ ఇంజనీర్స్ డే
నేడు (సెప్టెంబర్ 15న) దేశవ్యాప్తంగా జాతీయ ఇంజనీర్స్ నోత్సవాన్ని(Engineers Day) జరుపుకుంటున్నాము. అయితే అసలు ఎందుకు జరుపుకుంటున్నాము. ఎవరి సేవలను గుర్తు చేసుకుంటున్నాం అనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
ఏ దేశ నిర్మాణంలోనైనా ఇంజనీర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఇంజనీర్ల సహకారం ద్వారానే దేశం ముందుకు సాగి అభివృద్ధి చెందుతోంది. అయితే నేషనల్ ఇంజనీర్స్ డే(national Engineers Day)ని సెప్టెంబర్ 15న మాత్రమే ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. భారతదేశపు గొప్ప ఇంజనీర్లలో ఒకరైన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య(mokshagundam Visvesvaraya) జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న విశ్వేశ్వరయ్య జయంతి జరుపుకుంటారు. ఆయన గౌరవార్థం సెప్టెంబర్ 15ని దేశంలో నేషనల్ ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నాం. దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషికి, కింగ్ జార్జ్ V ద్వారా అతనికి నైట్ కమాండర్ ఆఫ్ బ్రిటిష్ ఇండియన్ ఎంపైర్ (KCIE) బిరుదు లభించింది. 1955వ సంవత్సరంలో భారత ప్రభుత్వం భారతరత్నను కూడా ప్రదానం చేసింది. ఆయన చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న క్రమంలో మైసూరులోని కృష్ణ రాజ సాగర డ్యామ్‌ను అభివృద్ధి చేసి గుర్తింపు పొందారు.
ఎన్నో ప్రాజెక్టులు
అంతేకాదు మైసూరులోని కృష్ణ రాజ సాగర ఆనకట్ట అభివృద్ధి, దక్కన్ పీఠభూమిలో నీటిపారుదల వ్యవస్థ అమలు తీరు, హైదరాబాద్(hyderabad) నగరానికి వరద నీటి డ్రైనేజీ రక్షణ వ్యవస్థ, ఉస్మాన్ సాగర్ వంటి అనేక కీలక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. అంతేకాదు విశాఖపట్నం(visakhapatnam) ఓడరేవును రక్షించే వ్యవస్థను అభివృద్ధి చేయడంలో కూడా ఆయన ప్రధాన పాత్ర పోషించారు. విశ్వేశ్వరయ్య ఇచ్చిన సాంకేతిక సలహా ఆధారంగానే గంగా నదిపై మోకామా వంతెనను బీహార్‌లో నిర్మించారు. అతను మైసూర్ దివాన్‌గా పనిచేసిన కాలంలో M విశ్వేశ్వరయ్య మైసూర్ సోప్ ఫ్యాక్టరీ, బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, మైసూర్ ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల వంటి అనేక సంస్థలను స్థాపించారు. దీంతో మైసూర్ అభివృద్ధికి ఆయన చేసిన కృషికిగాను ఆయనను ఆధునిక మైసూర్ రాష్ట్ర పితామహుడు అని కూడా పిలుస్తున్నారు.
పుట్టింది
సర్ MV అని పిలువబడే విశ్వేశ్వరయ్య 1860 సెప్టెంబర్ 15న కర్ణాటక(karnataka)లోని ముద్దెనహళ్లిలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అతను సివిల్ ఇంజనీర్, రాజనీతిలో విద్యనభ్యసించారు. మైసూర్ పంతొమ్మిదవ దివాన్ దగ్గర 1912 నుంచి 1919 వరకు ఏడు సంవత్సరాల పాటు పనిచేశారు.
ఇతర దేశాల్లో ఇంజనీర్స్ డే
భారతదేశంలోనే కాకుండా ఇంజనీర్లను గౌరవించటానికి ఇతర దేశాల్లో కూడా ఇంజనీర్స్ డే(Engineers Day)ని కూడా జరుపుతున్నారు. భారతదేశంలో ఈ రోజును సెప్టెంబర్ 15 న జరుపుకుంటారు. పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో మే 7 న, ఇటలీలో జూన్ 15న, ఇరాన్లో ఫిబ్రవరి 24న, రొమేనియాలో సెప్టెంబర్ 14న, బెల్జియంలో మార్చి 20న నిర్వహిస్తున్నారు.
కర్ణాటక(karanataka)లోని యాదగిరిగి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Accident) సంభవించింది. ఆగిఉన్న లారీని వేగంగా వచ్చిన జీపు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన ఐదురుగు మరణించారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. మృతులు మునీర్, నయామత్, రమీజా బేగం, ముద్దత్ షీర్, సుమ్మి ఉన్నట్లు గుర్తించారు. అయితే వీరంతా నంద్యాల జిల్లా వెలగోడు మండలానికి చెందినవారని తెలుస్తోంది. బాధితులు కలబురిగిలోని దర్గా ఉరుసు జాతర(ursu jatara)కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా […]