»Modi Said Visit India Tourist Palaces And Women Empowerment In Mann Ki Baat 104th Episode
Narendra modi: ఆ ప్రాంతాలు సందర్శించండి..మన్ కీ బాత్లో మోడీ వ్యాఖ్యలు
ఈరోజు మన్ కీ బాత్(MannKiBaat) 104వ ఎడిషన్లో ప్రధాని మోడీ(narendra modi) ప్రసంగించారు. గత నెల జూలై 30న మన్ కీ బాత్ 103వ ఎడిషన్ ప్రసారమైంది. ఈ సందర్భంగా ప్రధాని తొలిసారిగా మేరీ మతి మేరా దేశ్ ప్రచారాన్ని ప్రస్తావించారు. ఆదివారం జరిగిన ఈ ఎపిసోడ్లో కీలక అంశాలను మోడీ ప్రస్తావించారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
Modi said Visit india tourist palaces and women empowerment in Mann Ki Baat 104th episode
భారత ప్రధాని మోడీ(narendra modi) మన్ కీ బాత్(MannKiBaat) 104వ ఎపిసోడ్లో ఆగస్టు 27న కీలక అంశాలను ప్రస్తావించారు. ఇది సావన్ మాసం మహాశివుని, పండుగ, ఆనందాన్ని పంచే మాసమని అన్నారు. చంద్రయాన్ విజయం ఈ వేడుకల వాతావరణాన్ని మరింత రెట్టింపు చేసిందని గుర్తు చేశారు. సాధారణంగా చంద్రుడిపైకి చేరుకోవడానికి మూడు రోజులకు పైగా సమయం పడుతోంది. చంద్రయాన్ విజయం చాలా గొప్పదని పేర్కొన్నారు. ఆగస్ట్ 23న మిషన్ చంద్రయాన్ న్యూ ఇండియా స్ఫూర్తికి చిహ్నంగా మారిందని, ఇది మరిన్ని మార్పులను కోరుకుంటుందని చెప్పారు.
చంద్రయాన్ మిషన్లో మహిళా(womens) సారథ్యం గురించి ప్రత్యేకంగా గుర్తు చేశారు. మహిళా శక్తిని జోడిస్తే అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయవచ్చన్నారు. అందుకు మిషన్ చంద్రయాన్ మహిళా శక్తి ప్రత్యక్ష ఉదాహరణ అంటు ప్రశంసించారు. చాలా మంది మహిళా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఈ మిషన్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని తెలిపారు. భారత మహిళలు ఇప్పుడు అంతరిక్షాన్ని కూడా సవాలు చేస్తున్నారని చెప్పారు. మన దేశపు ఆడపిల్లలు ఇంత ప్రతిష్టాత్మకంగా మారినప్పుడు, దేశం అభివృద్ధి చెందకుండా ఎవరు ఆపగలరని మోడీ ధీమా వ్యక్తం చేశారు. చంద్రయాన్ 3 విజయంలో మన శాస్త్రవేత్తలతో పాటు ఇతర రంగాలు కూడా కీలక పాత్ర పోషించాయని ప్రధాని గుర్తు చేశారు.
మరోవైపు దేశ ప్రజలందరి కృషి వల్లే ‘హర్ ఘర్ తిరంగ అభియాన్’ వాస్తవంగా ‘హర్ మనా తిరంగ అభియాన్’గా మారింది. ఈ ప్రచారంలో అనేక రికార్డులు కూడా నమోదయ్యాయన్నారు. కోట్లలో త్రివర్ణ పతాకాలను దేశప్రజలు(people) కొనుగోలు చేశారు. 1.5 లక్షల పోస్టాఫీసుల ద్వారా దాదాపు 1.5 కోట్ల త్రివర్ణ పతాకాలను విక్రయించారు. దీని వల్ల మన కార్మికులు, చేనేత కార్మికులు, ముఖ్యంగా మహిళలకు కూడా వందల కోట్ల రూపాయల ఆదాయం లభించిందన్నారు. ఈసారి త్రివర్ణ పతాకంతో సెల్ఫీ దిగి దేశప్రజలు సరికొత్త రికార్డు సృష్టించారు. గతేడాది ఆగస్టు 15న దాదాపు ఐదు కోట్ల మంది త్రివర్ణ పతాకంతో సెల్ఫీలు దిగగా…ఈ ఏడాది ఈ సంఖ్య 10 కోట్లు దాటింది.
ప్రస్తుతం దేశంలో ‘మేరి మతి, మేర దేశ్’ అనే స్ఫూర్తిని చాటిచెప్పే ప్రచారం జోరుగా సాగుతోంది.సెప్టెంబర్ నెలలో దేశంలోని ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటి నుంచి మట్టిని సేకరించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. . దేశపు పుణ్య నేల అమృత కలశంలో నిక్షిప్తమవుతుంది. అక్టోబర్ నెలాఖరులో అమృత కలశ యాత్రతో దేశ రాజధాని ఢిల్లీకి వేలాది మంది చేరుకుంటారు. ఢిల్లీలో ఈ మట్టి నుంచి అమృత వాటిక నిర్మిస్తారు. ప్రతి దేశస్థుని కృషి ఈ ప్రచారాన్ని విజయవంతం చేస్తుందని తాను ఖచ్చితంగా భావిస్తున్నట్లు మోడీ చెప్పారు. దీంతోపాటు అవకాశం దొరికినప్పుడల్లా మన దేశ పౌరులు ఇండియాలో గల సౌందర్యమైన, వైవిధ్యమైన పర్యాటక ప్రాంతాలు(tourist places) చూసేందుకు తప్పకుండా వెళ్లాలని కోరారు.