»Mayawati Removes Akash Anand As National Coordinator Imran Masood And Akhilesh Yadav Comments
Mayawati : తన వారసుడిగా మేనల్లుడి నియమించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న మాయావతి
యూపీ రాజకీయాల్లో మసకబారిన బహుజన్ సమాజ్ పార్టీలో ఇప్పుడు అంతర్గతంగా గందరగోళం నెలకొంది. ఆకాష్ ఆనంద్ ను తన వారసుడిగా ప్రకటించిన బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఇప్పుడు ఆకాష్ ఆనంద్ ను బాధ్యతల నుంచి తప్పించారు.
Mayawati : యూపీ రాజకీయాల్లో మసకబారిన బహుజన్ సమాజ్ పార్టీలో ఇప్పుడు అంతర్గతంగా గందరగోళం నెలకొంది. ఆకాష్ ఆనంద్ ను తన వారసుడిగా ప్రకటించిన బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఇప్పుడు ఆకాష్ ఆనంద్ ను బాధ్యతల నుంచి తప్పించారు. మాయావతి నిర్ణయంపై ఇమ్రాన్ మసూద్, అఖిలేష్ యాదవ్, భీమ్ ఆర్మీ నేతలు స్పందించారు. మాయావతి నిర్ణయాన్ని బీజేపీ ఒత్తిడి మేరకే తీసుకున్నట్లు ప్రతిపక్ష నేతలు అభివర్ణిస్తున్నారు. డిసెంబర్ 2023లో జరిగిన పార్టీ సమావేశంలో మాయావతి ఆకాష్ ఆనంద్‌ను తన వారసుడిగా ప్రకటించారు. ఆ తర్వాత ఆకాష్ ఆనంద్ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లి బీఎస్పీ కోసం ప్రచారం చేశారు. బీజేపీపై వివాదాస్పద కామెంట్స్ చేసినందుకుగానూ ఆయనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయన పూర్తి స్థాయి పరిపక్వత సాధించే వరకు అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు మాయావతి ప్రకటించారు.
కో-ఆర్డినేటర్ పదవి నుంచి ఆకాష్ ఆనంద్‌ను తొలగించడంపై కాంగ్రెస్ నాయకుడు ఇమ్రాన్ మసూద్ మాట్లాడుతూ, “బిఎస్పిని స్థాపించడానికి మాయావతి ఇచ్చిన ప్రకటనలతో పోలిస్తే ఆకాష్ ఆనంద్ ప్రకటన ఏమీ లేదు. మాయావతి తన మిషన్ ఉద్యమం నుండి తప్పుకున్నారని.. బిజెపికి బందీగా ఉందని ఆయన అన్నారు. దళిత ఉద్యమాన్ని నడుపుతున్న చంద్రశేఖర్ సంస్థ భీమ్ ఆర్మీ నాయకులు కూడా మాయావతి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. బీజేపీ ఒత్తిడి మేరకే మాయావతి ఆకాష్ ఆనంద్‌పై చర్యలు తీసుకున్నారని భీమ్ ఆర్మీ, ఆజాద్ సమాజ్ పార్టీ నేతలు తెలిపారు. ఆకాష్ ఆనంద్ బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెట్టినందుకే.. అతను తన పదవి నుండి తప్పించబడ్డాడు. బీజేపీకి మేలు చేసేందుకే మాయావతి ఇదంతా చేశారని భీమ్ ఆర్మీ నేతలు పేర్కొంటున్నారు.