»Karnataka Polls 2023 Kumaraswamy Wins But Son Nikhil Loses
Karnataka Elections: తండ్రి గెలుపు, కొడుకు ఓటమి..!
కర్ణాటక ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. తాము అధికారంలోకి వస్తామని అధికార పార్టీ బీజేపీ చాలా కాన్పిడెంట్ గా ఉంది. లేదు మేమే గెలుస్తాం అని కాంగ్రెస్ భావించింది. తాము మాత్రం ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుతాం.. ఏ పార్టీ అధికారం చేపట్టాలో మా చేతుల్లో ఉంటుంది అని జేడీఎస్ భావించింది. కానీ చివరకు కాంగ్రెస్ నమ్మకమే నిజమైంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. తాము అధికారంలోకి వస్తామని అధికార పార్టీ బీజేపీ చాలా కాన్పిడెంట్ గా ఉంది. లేదు మేమే గెలుస్తాం అని కాంగ్రెస్ భావించింది. తాము మాత్రం ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుతాం.. ఏ పార్టీ అధికారం చేపట్టాలో మా చేతుల్లో ఉంటుంది అని జేడీఎస్ భావించింది. కానీ చివరకు కాంగ్రెస్ నమ్మకమే నిజమైంది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో విజయ ఢంకా మోగించింది. బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఇక జేడీఎస్ కూడా ఎప్పుడూ లేనంతగా కేవలం 19 స్థానాలకు పడిపోయింది.
తమ పార్టీకి తక్కువ సీట్లు రావడమే కాకుండా, జేడీఎస్ అధినేత కుమారస్వామికి మరో షాక్ కూడా తగిలింది. ఆయన ఎన్నికల్లో గెలిచినా, ఆయన కుమారుడు నిఖిల్ గౌడ మాత్రం ఓటమి చవిచూడాల్సి ఉంది. రామనగర నియోజకవర్గం నుంచి పోటీచేసిన నిఖిల్ ఓడిపోయాడు. ‘జాగ్వర్’తో తెలుగువారికి నిఖిల్ గౌడ పరిచయమే. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు. ఈ ఎన్నికల్లో కుమారస్వామి భార్య రామనగర టికెట్‌ను కుమారుడు కోసం త్యాగం చేసింది. దీంతో రామనగర స్థానంలో నిఖిల్ గౌడ జేడీఎస్ తరపున పోటీ చేశాడు. కాంగ్రెస్ నుంచి ఇక్బాల్ హుస్సేన్, బీజేపీ తరపున మరిలింగగౌడలు పోటీపడ్డారు. ఈ త్రిముఖ పోరులో కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ హుస్సేన్ దాదాపు 10 వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. హుస్సేన్‌కు 87,285 ఓట్లు రాగా, నిఖిల్ గౌడకు 76,439 ఓట్లు వచ్చాయి.