ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) తమ యూజర్ల కోసం అదిరిపోయే ఫీచర్లను తీసుకొస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్రిక్స్ ను తమ యూజర్లకు (Users) అందిస్తుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ యాప్‌కు మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకూ కూడా వాట్సాప్ వాడనివారంటూ ఎవ్వరూ ఉండరు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా వాట్సాప్ కొత్త ఫీచర్స్2ను అందుబాటులోకి తెస్తుంటుంది.
ఈమధ్య కాలంలో వాట్సాప్ ప్రైవసీ ఫీచర్ల (Privacy Features)ను తమ యూజర్లకు అందుబాటులోకి తెస్తోంది. తాజాగా మరో ఆసక్తికర ఫీచర్‌ను రిలీజ్ చేసింది. సాధారణంగా వాట్సాప్‌లో వ్యక్తిగత చాట్స్ అందరికీ తెలుసు. అయితే ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీ మెంబర్స్ తో కొన్ని ఇంపార్టెంట్ విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆ చాట్ ను పక్కవారు చూసే అవకాశం ఉంది. ఒక వేళ ఎవరికైనా ఫోన్ ఇస్తే సీక్రెట్ చాట్స్ అంతా వారు చూడొచ్చు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది.
కొత్త ఫీచర్‌తో మీ చాట్‌ను ఎవ్వరికీ కనిపించకుండా చేసే అవకాశం ఉంది. ఈ ఫీచర్ (Features) కోసం ముందుకు వాట్సాప్(Whatsapp)ను లేటెస్ట్ వెర్షన్ లోకి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి లాక్ చేయాలనుకుంటున్న చాట్‌ను ఓపెన్ చేసి ప్రొఫైల్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేశాక అక్కడ ‘చాట్ లాక్’ అనే ఆప్షన్ ఉంటుంది. దానిని క్లిక్ చేశాక ‘లాక్ దిస్ చాట్ విత్ ఫింగర్ ప్రింట్’ అనే ఆప్షన్ ను ఎనేబులు చేయాల్సి ఉంటుంది.
ఎనేబుల్ చేసిన తర్వాత ఆ చాట్ మెయిన్ చాట్ బాక్స్ (Chat Box)లో ఎవ్వరికీ కూడా కనిపించకుండా ఉంటుంది. ఒక వేళ ఆ చాట్ ను ఓపెన్ చేసుకోవాలనుకుంటే ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయాలి. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత లాక్డ్ చాట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత థంబ్నెయిల్తో అన్‌లాక్ చేసుకుంటే హైడ్ చేసిన చాట్ ఓపెన్ అవ్వుతుంది.