Birds Hospital : వడదెబ్బ తగిలిన పక్షులను అక్కడ ఇంటెన్సివ్‌ కేర్‌లో పెడతారట!

ఎండలకు పక్షులు సొమ్మసిల్లి పడిపోతున్న ఘటనలూ గత కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి. ఇలాంటి పక్షులకు చికిత్స అందించేందుకు ఓ దగ్గర ‘బర్డ్‌ హాస్పిటల్‌’ పేరుతో పెద్ద ఆసుపత్రే ఉంది. ఇంతకీ అదెక్కడ? వారేంచేస్తారు? తెలుసుకుందాం రండి.

  • Written By:
  • Updated On - April 23, 2024 / 10:58 AM IST

Birds Hospital In Delhi : ఈ ఎండలకు మనుషులే అల్లల్లాడిపోతన్నారు. ఇక చిన్న చిన్న జీవ రాశుల సంగతి ఏమిటో ఊహించనక్కర్లేదు. పక్షులకు సరైన నీడ, నీరు దొరక్క వడదెబ్బ తగిలి సొమ్మసిల్లిపోతున్నాయి. ఇటీవల కాలంలో ఈ ఘటనలు వరుసగా పెరుగుతున్నాయి. ఇలాంటి మూగ జీవాలకు సేవ చేసేందుకు దిల్లీలోని ‘బర్డ్‌ హాస్పిటల్‌’ నడుం బిగించింది. వాటికి సరైన సమయంలో చికిత్సలు అందించి ఎన్నో పక్షులను కాపాడుతోంది.

చదవండి :  తైవాన్ లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు పై 6.3గా నమోదు

దిల్లీలోని(Delhi) చాందినీ చౌక్‌లో ఛారిటీ బర్డ్స్‌ హాస్పిటల్‌(BIRDS HOSPITAL) అని పెద్ద ఆసుపత్రి ఉంది. ఎండల కారణంగా అనారోగ్యాల బారిన పడిన ఎన్నో పక్షులు రోజూ ఆ ఆసుపత్రికి పెద్ద సంఖ్యలోనే చేరుకుంటున్నాయి. వాటి పరిస్థితిని గమనించి అక్కడి వైద్యులు వాటికి చికిత్సలు అందిస్తున్నారు. అక్కడ హరావతార్‌ సింగ్ అనే సీనియర్‌ వెటర్నరీ డాక్టర్‌ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఎండల వల్ల పక్షులు ఆసుపత్రికి వచ్చే కేసులు బాగా పెరుగుతున్నాయని తెలిపారు.

చదవండి : వరుసగా రెండో రోజూ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

రోజుకు ఐదు నుంచి పదిహేను వరకు పక్షులు(BIRDS) ఎండల వల్ల ఆసుపత్రికి చేరుతున్నాయని హరావతార్‌ సింగ్‌ అన్నారు. ప్రస్తుతం రకరకాల వ్యాధులతో తమ ఆసుపత్రిలో 40 వరకు పక్షులు ఉన్నాయని తెలిపారు. వడ దెబ్బ తగిలి ఆసుపత్రికి చేరిన పక్షులకు మొదట నీళ్లను స్ప్రింకిల్‌ చేస్తామన్నారు. తర్వాత ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ పెట్టి దాని శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చేట్లు చూస్తామని తెలిపారు. వాటి శరీర ఉష్ణోగ్రత 110 డిగ్రీల ఫారన్‌హీట్‌ దాటితే ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. అప్పుడు అవి బతకడానికి తక్షణ సాయం అందించాలని చెప్పారు. ఆ సమయంలో అవసరం అనుకుంటే వాటిని ఇంటెన్సివ్‌ కేర్‌లో పెడతామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ న్యూస్‌ వైరల్‌గా మారింది.

Related News