»Dont Make Us Fight Ashok Gehlot To Media Amid Tussle With Sachin Pilot
Ashok Gehlot:మా మధ్య చిచ్చులు పెట్టకండి.. అశోక్ గెహ్లట్ ఆసక్తికర వ్యాఖ్యలు
సీఎం అశోక్ గెహ్లాట్ మీడియా(Media)తో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు, డిప్యూటీ సీఎం(Deputy Cm)కు మధ్య పోరు నడుస్తున్న సమయంలో.. మీడియా ప్రజలను గొడవ పెట్టుకోవడానికి పూనుకోరాదని అన్నారు.
Ashok Gehlot: దేశంలోని పలు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది చివరిలో జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections)కు ప్రధాన పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్(Election Schedule) రానుంది. ప్రస్తుతం రాజస్థాన్()Rajastan)లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. సీఎం అశోక్ గెహ్లాట్(CM Ashok Gehlot), మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్(Sachin Pilot) మధ్య పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. 2018 డిసెంబర్లో రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి సీఎం పదవిపై వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో రాష్ట్రంలోని ప్రధాన నాయకుల(Leader) మధ్య విబేధాలు నష్టం కలిగిస్తామని నిపుణుల అభిప్రాయం.
ఈ క్రమంలోనే సీఎం అశోక్ గెహ్లాట్ మీడియా(Media)తో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు, డిప్యూటీ సీఎం(Deputy Cm)కు మధ్య పోరు నడుస్తున్న సమయంలో.. మీడియా ప్రజలను గొడవ పెట్టుకోవడానికి పూనుకోరాదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి ఘటనను సీఎం అశోక్ గెహ్లాట్ చూసీ చూడనట్టు వదిలిపెడుతున్నారని, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ సచిన్ పైలట్(Sachin Pilot) ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ పోరు ఇంకా అలాగే కొనసాగుతున్నది. ఈ తరుణంలో అశోక్ గెహ్లాట్ సోమవారం మీడియాలో మాట్లాడుతూ.. ‘మీడియా నిజాలు, వాస్తవ విషయాలకు అంకితం కావాలి. అంతేకానీ, ప్రజలు ఒకరినొకరు కొట్టుకునేలా చేయరాదు. మీడియా ప్రతినిధులు వారి విధులను పూర్తి చేసుకోవాలి. అది ప్రజా ప్రయోజనాలే కేంద్రంగా ఉండాలి. వాస్తవాలను ప్రచారం చేయడానికి మీడియా ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలి’ అని అశోక్ గెహ్లాట్(CM Ashok Gehlot) అన్నారు.