»Bihar Minister Likens Agniveer Scheme To An Army Of Eunuchs
Agnipath : అగ్నివీర్ పథకంని నపుంసకుల సైన్యంగా పోల్చిన బీహార్ మంత్రి
బీహార్( Bihar) మంత్రి ఆర్జేడి (RJD) నేత సురేంద్ర యాదవ్ (Surendra Yadav) అగ్నివీర్ పధకంపై వివాస్పద వ్యాఖ్యలు చేశారు. అగ్నివీర్ పధకం “ హిజ్రోంకా ఫౌజ్” (నపుంసకుల సైన్యంగా)గా మారుతుందని అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడూతూ సరిగ్గా 8.5 ఏళ్ల తర్వాత అగ్ని వీరుల (Agniveer) సైన్యం నపుంసకుల సైన్యంగా మారుతుందని ఆయన అన్నారు.
బీహార్( Bihar) మంత్రి ఆర్జేడి (RJD) నేత సురేంద్ర యాదవ్ (Surendra Yadav) అగ్నివీర్ పధకంపై వివాస్పద వ్యాఖ్యలు చేశారు. అగ్నివీర్ పధకం “ హిజ్రోంకా ఫౌజ్” (నపుంసకుల సైన్యంగా)గా మారుతుందని అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడూతూ సరిగ్గా 8.5 ఏళ్ల తర్వాత అగ్ని వీరుల (Agniveer) సైన్యం నపుంసకుల సైన్యంగా మారుతుందని ఆయన అన్నారు. ఈ సమయంలో అగ్నివీర్ల శిక్షణ కూడా పూర్తికాదు.” అన్నారాయన. “మన ఆర్మీ ప్రపంచంలోనే అత్యంత పటిష్టంగా ఉన్నప్పుడు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? 4.5 ఏళ్లలో ఎలాంటి ఆర్మీని సిద్ధం చేస్తారు?” అని ఆయన ప్రశ్నించారు. ఈ ఆలోచనను అందించిన వారిని ఉరితీయాలని బీహార్ సురేంద్ర యాదవ్ అన్నారు.
ఆ ఆలోచన చేసిన వ్యక్తి అంతకంటే తక్కువ శిక్షకు అర్హుడు కాదన్నారు.25-26 సంవత్సరాల వయస్సులో అగ్నివీర్‌గా పదవీ విరమణ చేసే వారిని ఎవరూ వివాహం (Marriage) చేసుకోరని ఆయన తెలిపారు. ఆ వయస్సులో రిటైర్డ్ సైనికుడిని అంటే వారిని ఎవరు వివాహం చేసుకుంటారని ఆయన ప్రశ్నించారు. గతేడాది జూన్ 14న ప్రకటించిన అగ్నిపథ్ (Agnipath) పథకం కింద 17న్నర ఏళ్ల నుంచి 21 ఏళ్లలోపు వయసున్న యువకులను ఈ మూడు సర్వీసుల్లో నాలుగేళ్లపాటు 25 శాతం మందిని మరో 15 ఏళ్లపాటు కొనసాగించాలనే నిబంధనతో నియమించుకుంటున్నారు. 2022 కోసం, గరిష్ట వయోపరిమితి 23 సంవత్సరాలకు పొడిగించబడింది.అగ్నిపథ్ లో చేరి అగ్ని వీర్ లు సైన్యంలో ఉండగా ఎలా చనిపోయినా వారికి రూ. 48 లక్షల జీవిత బీమా (Life Insurance) కల్పిస్తుంది. కేంద్రం ప్రభుత్వం. విధి నిర్వహణలో చనిపోతే 44 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అదనంగా చెల్లిస్తుంది. అలాగే సైన్యంలో ఉండగా శారీరక వైకల్యం 100 శాతం ఉంటే రూ. 44 లక్షలు, 75 శాతమైతే రూ. 25 లక్షలు, 50 శాతమైతే రూ15 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తారు. ఎలాంటి సమస్యలు లేని అగ్ని వీర్(Agniveer) లకు వారి జీతంలో కొంత మొత్తాన్ని కార్పస్ ఫండ్ జమచేస్తారు.
నాలుగేళ్ల తర్వాత కర్పస్ ఫండ్ రూ. 5లక్షలకు కేంద్రం మరో రూ. 5 లక్షలు కలిపి మొత్తం రూ. 11.71 లక్షలు చెల్లిస్తుంది. యువతలో జాతీయ భావాన్ని బలోపేతం చేయడం, భారత సైన్యాన్ని యువసైన్యంగా మార్చడం, సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే యువత ఆకాంక్షను నెరవేర్చడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా భారత సైన్యాన్ని ఎలా అప్‌గ్రేడ్ చేయాలనే అంశంపై చాలా కాలంగా జరుగుతున్న చర్చలో భాగంగానే అగ్నిపథ్ (Agnipath) పుట్టుకొచ్చిందని చెబుతున్నారు అధికారులు. కోవిడ్ కాలంలో భారతదేశంలో నిరుద్యోగం (unemployment) రేటు 25 శాతానికి చేరుకుంది. దేశంలో ఉద్యోగాలు రాకపోవడం పెద్ద సమస్యగా మారిన తరుణంలో వచ్చే ఏడాదిన్నర కాలంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో 10 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం.