యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన ‘దేవర’ మూవీ బాక్సాఫీస్ వద్ద దూకుడు కనబరుస్తోంది. తాజాగా ఈ సినిమా రూ.400 కోట్ల క్లబ్లో చేరినట్లు మేకర్స్ ప్రకటించారు. ఏడు రోజుల్లో ఈ సినిమా రూ.405 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుపుతూ మేకర్స్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలు పోషించారు.