టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. జల్పల్లిలోని తన నివాసంలో పనిమనిషి నాయక్ రూ.10 లక్షలు దొంగిలించి పారిపోయాడు. ఈ మేరకు మోహన్ బాబు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అతన్ని తిరుపతిలో అరెస్ట్ చేశారు.