తాను హక్కులు పొందిన ఓ ప్రముఖ నవలలోని సన్నివేశాలను అనుమతి లేకుండా కొన్ని సినిమాల్లో వినియోగించారని ప్రముఖ దర్శకుడు శంకర్ ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. “వెంకటేశన్ రాసిన తమిళ నవల ‘నవయుగ నాయగన్ వేళ్ పారి’ కాపీరైట్స్ నావే. కానీ, అందులోని సన్నివేశాలను చాలా సినిమాల్లో వినియోగించడం చూసి షాకయ్యా. క్రియేటర్ల హక్కులను గౌరవించండి. కాపీరైట్‌ను ఉల్లంఘించకండి. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సివస్తుంది” అని హెచ్చరించారు.