మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘లక్కీ భాస్కర్’ మూవీ ఈ నెల 31న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు సాయంత్రం 6 గంటలకు HYDలోని ఫిలింనగర్ JRC కన్వెన్షన్‌లో జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విజయ్ దేవరకొండ, త్రివిక్రమ్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది.