గిన్నిస్ బుక్ రికార్డులో మెగాస్టార్ చిరంజీవి స్థానం దక్కించుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ‘ప్రముఖ సినీ నటుడు శ్రీ కొణిదెల చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కడం తెలుగు వారు గర్వించదగ్గ విషయం. ఈ శుభ సందర్భంలో వారికి నా అభినందనలు’ అని ట్వీట్ చేశారు. కాగా 150కి పైగా సినిమాల్లో అన్ని రకాల డ్యాన్లతో అలరించిన ఏకైక నటుడిగా చిరంజీవి గిన్నిస్ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే.