అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ ‘లవ్ రెడ్డి’. కొత్త డైరెక్టర్ స్మరన్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సినిమాకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సపోర్ట్ ఇచ్చారు. ఈ మేరకు ఇన్స్టా వేదికగా.. ‘లవ్ రెడ్డి’ మూవీకి సంబంధించి ఎన్నో మంచి విషయాలు తన దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో రిలీజైన ప్రేమ కథల్లో ఈ మూవీ మంచి సినిమాగా నిలవడం సంతోషంగా ఉందని తెలిపారు.