తమిళ హీరో కార్తీ, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన ‘ఖైదీ’ మూవీ 2019లో రిలీజై భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా లోకేష్ ట్వీట్ చేశారు. ‘అంతా ఇక్కడ నుంచే మొదలైంది. కార్తీ, SR ప్రభులకు ధన్యవాదాలు. వారి వల్లే లోకేష్ యూనివర్సల్ సాధ్యమైంది. త్వరలోనే ఢిల్లీ తిరిగి రానున్నారు’ అని పేర్కొన్నారు. దీంతో త్వరలోనే ‘ఖైదీ 2’ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.